Nude Protest In Chattisgarh|
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ( Protests ) తరుచూ చూస్తూనే ఉంటాం. కానీ ఛత్తీస్ ఘడ్ ( Chattisgarh ) రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తార స్థాయికి చేరాయి.
రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్సి-ఎస్టీ ( Sc-St ) యువజన విభాగాలకు చెందిన కొంతమంది యువకులు నగ్న ప్రదర్శన ద్వారా ప్రభుత్వానికి తమ నిరసనను తెలియపరిచారు.
ఇప్పుడు ఈ వార్త దేశంలో తెగ వైరల్ ( Viral ) గా మారింది.
Read Also: ప్రతిపక్షాల కూటమి పేరు ‘INDIA’.. అంటే అర్థం తెలుసా!
వివరాల్లోకెళ్తే ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో చాలా మంది నకిలీ సర్టిఫికెట్స్ ( Fake Certificates ) వాడుకొని ఉద్యోగాన్ని సంపాదించినట్లు వారు ఆరోపిస్తున్నారు.
నకిలీ సర్టిఫికెట్ వాడుకుని ఉద్యోగం సంపాదించిన వారిపై ప్రభుత్వం వెంటనే యాక్షన్ ( Action ) తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అందులో భాగంగా మంగళవారం ఎస్సి-ఎస్టీ యువజన విభాగాలకు చెందిన కొద్దీ మంది యువకులు పూర్తి నగ్నంగా ప్లకార్డ్స్ పట్టుకొని రాష్ట్ర శాసనసభను ముట్టడించే ప్రయత్నం చేశారు.
ఈ నిరసనకు సంబందించిన వీడియో సామాజిక మాధ్యమా (Social Media )ల్లో తెగ వైరల్ గా మారింది.
అందులో కొద్దిమంది యువకులు రద్దీగా ఉండే రోడ్లపై పూర్తి నగ్నంగా రాష్ట్ర శాసనసభ వైపు పరిగెడుతూ కనిపిస్తున్నారు.
శాసనసభ వైపు వెళ్తున్న యువకులని పోలీసులు అడ్డగించి కస్టడీలోకి తీసుకున్నారు.