Tuesday 17th March 2026
12:07:03 PM
Home > తాజా > మాజీ సీఎం కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే!

మాజీ సీఎం కేసీఆర్ హెల్త్ బులెటిన్ విడుదల.. వైద్యులు ఏమన్నారంటే!

kcr

KCR Health Bulletin | బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ (KCR Health Bulletin) విడుదల చేశారు. కేసీఆర్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆయన తుంటి ఎముకకు గాయమైందని తెలిపారు.

శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ గాయం నుంచి కోలుకునేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుందని యశోద ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.

శుక్రవారం సాయంత్రం 4గంటలకు కేసీఆర్‌ ఎడమతుంటికి సర్జరీ చేయనున్నట్లు తెలిపారు. కేసీఆర్ కు సర్జరీ చేయనున్న వైద్య బృందంలో కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ కూడా ఉన్నారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions