Palakurthy Assembly News| తెలంగాణ ( Telangana ) ఎన్నికల ఫలితాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. గ్రామీణ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) విజయ దుందుభి మోగించింది.
కాంగ్రెస్ గాలిలో బీఆరెస్ ( BRS ) కు చెందిన ఆరుగురు మంత్రులు ఓటమిని చవిచూశారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఓటమి ఎరుగని నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకరరావు ( Errabelli Dayakar Rao ) కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
1994 నుండి ఆరు సార్లు ఎమ్మెల్యే ( MLA )గా, ఒకసారి ఎంపీ ( MP )గా గెలిచిన ఆయన ఈ ఎన్నికల్లో మాత్రం 26 ఏళ్ల యశస్విని రెడ్డి ( Yashaswini Reddy ) చేతిలో ఘోర పరభావాన్ని మూటగట్టుకున్నారు.
మహుబూబ్ నగర్ ( Mahbubnagar ) జిల్లాకు చెందిన యశస్విని రెడ్డి వివాహం అనతరం అమెరికా వెళ్లి బిసినెస్ బాధ్యతల్ని చేపట్టారు. అయితే ఆమె అత్త హనుమండ్ల జాన్సిరెడ్డి ( Hanumandla Jhansi Reddy ) మాత్రం గత కొంత కాలంగా పాలకుర్తి ( Palakurthy ) నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ టికెట్ హామీ వచ్చినా, భారత పౌరసత్వ విషయంలో చిక్కులు రావడం తో తన కోడలు అయిన యశస్విని రెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు.
అత్త వ్యూహాలతో, కోడలు ప్రచారంలో దూసుకుపోయి ఓటమి ఎరుగని ఎర్రబెల్లిని ఓడించి రాష్ట్రంలో సంచలనం సృష్టించారు ఆమె.