World’s Most Deadliest Animal ‘Mosquito’ | సైజులో చిన్నదే అయినా ప్రజల్ని పెద్ద సంఖ్యలో బలి తీసుకుంటుంది దోమ. ప్రపంచంలోనే ఎక్కువమంది ప్రాణాలు తీస్తున్న జీవి దోమ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వెల్లడించింది.
పాములను, పులులను వెనక్కు నెట్టేసిన దోమ ఏటా ఏకంగా 7 లక్షల 25 వేలకు పైగా ప్రజల ప్రాణాలు తీస్తున్నట్లు నివేదిక వెల్లడైంది. దోమ కారణంగా మలేరియానే కాకుండా యెల్లో ఫీవర్, డెంగీ, మెదడు వాపు ఇలా అనేక రకాల రోగాలు వస్తున్నాయి.
అయితే మలేరియా ఒక్కటే ప్రపంచ వ్యాప్తంగా 20కోట్ల మందిపై ప్రభావం చూపిస్తుంది. అలాగే మలేరియా కారణంగా ఏటా ఆరు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఈ క్రమంలో దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.