Woman’s Friendship Day Post For ‘Pati Dev’ Goes Viral | ఇద్దరూ క్లాస్ మేట్స్, అయినప్పటికీ ఎప్పుడూ మాట్లాడుకోలేదు. కానీ 15 సంవత్సరాల తర్వాత వివాహం చేసుకున్నారు.
‘ఫ్రెండ్షిప్ డే’ సందర్భంగా ఓ భార్య తన భర్తను ఉద్దేశించి చేసిన పోస్ట్ తెగ వైరల్ గా మారింది. వారి లవ్ స్టోరికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంచల్ రావత్ అనే ఆమె ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ‘నేను స్కూల్లో నన్ను ద్వేషించిన వ్యక్తిని వివాహం చేసుకున్నాను.
నేను అబ్బాయిలతో స్నేహం చేయడానికి ఇష్టపడని అమ్మాయిని. అయితే ఒకరోజు బాగా సిగ్గుపడే అబ్బాయి తన లంచ్ నాతో పంచుకోవడానికి ప్రయత్నించాడు. కానీ నేను అనుకోకుండా అతని పోకీమాన్ టిఫిన్ బాక్స్‌ను పగలగొట్టాను. ఆ రోజు ఆ అబ్బాయు దాదాపు ఏడ్చేశాడు.
అంతే అతను ఆ తర్వాత నాతో తిరిగి మాట్లాడలేదు. 15 సంవత్సరాల తర్వాత, ‘జీవన్‌సాతి’ వెబ్సైట్ ద్వారా నా క్లాస్ మెట్ ను కలిసాను. ‘నువ్వు నాకు కొత్త టిఫిన్ బాక్స్ ఎప్పుడు కొనిస్తావా?’ అని అబ్బాయి నాకు మొదటి మెసేజ్ పంపాడు.
మా స్కూల్ టైంలో స్నేహం ఏర్పడలేదు, కానీ ఇప్పుడు మా ఇద్దరి మధ్య ప్రేమ ఏర్పడి అది వివాహానికి దారి తీసింది. హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే పతిదేవ్’ అని అంచల్ రావత్ పోస్ట్ చేశారు. ఈ మేరకు స్కూల్ సమయంలో దిగిన గ్రూప్ ఫోటోను మరియు వివాహ ఫోటోను షేర్ చేశారు.








