Woman jumps off moving train to escape rape attempt | సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల దారుణం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ నుండి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలులో అత్యాచార యత్నం నుండి తప్పించుకునేందుకు ఓ యువతి ట్రైన్ లో నుండి దూకింది.
ప్రస్తుతం ఆమెకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు, బీఆరెస్ నాయకులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాసగౌడ్ మరియు ఎమ్మెల్యే కోవా లక్ష్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని పరామర్శించారు.
అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. మహిళల భద్రతపై రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకోవాలని, బాధితురాలిను ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా బీఆరెస్ నేతలు డిమాండ్ చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రాజకీయ వేదిక చేశారని, కమాండ్ కంట్రోల్ సెంటర్ పోలీసులకు వదిలేయాలన్నారు.
లక్ష కెమెరాలు కమాండ్ కంట్రోల్ నుండి పర్యవేక్షణ చేయవచ్చని, కానీ సెక్రటేరియట్ లో జరగాల్సిన కార్యకలాపాలు కమాండ్ కంట్రోల్ లో చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అందాల పోటీ లు కాదు.. మహిళలకు భద్రత కల్పించాలన్నారు. ఓ తల్లి తన కూతుళ్లు భద్రంగా ఉండాలి అని కోరుకుంటుంది, అందాల పోటీ కోరుకోవడం లేదని పేర్కొన్నారు.