Woman Fatally Stabbed in Mysuru Daylight Attack | కర్ణాటక రాష్ట్రంలో ఘోరం జరిగింది. పెళ్లి చేసుకోవాలని కోరినా నిరాకరిస్తుందనే కారణంతో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.
వివరాల్లోకి వెళ్తే..మాండ్య జిల్లాలోని పాండవపుర తాలూకాకు చెందిన 38 ఏళ్ల అభిషేక్, తనను ప్రేమించాల్సిందిగా అదే ప్రాంతానికి చెందిన 37 ఏళ్ల పూర్ణిమ వెంట పడుతున్నాడు. పూర్ణిమ మైసూరులో టీచర్ గా పనిచేస్తున్నారు.
శుక్రవారం పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న పూర్ణిమ వెంట అభిషేక్ పడ్డాడు. తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని బలవంతం పెట్టాడు. అయితే దీనికి పూర్ణిమ నిరాకరించింది. దింతో ప్రేమోన్మాది తన వెంట తెచ్చుకున్న కత్తితో పూర్ణమపై దాడి చేశాడు.
ఆమె అక్కడే పడిపోయింది. ఈ క్రమంలో రక్తపుమడుగులో పూర్ణిమ కొట్టుమిట్టాడుతుంటే అభిషేక్ మాత్రం పసుపు తాడును ఆమె మెడలో కట్టాడు. అనంతరం సెల్ఫీ తీసుకుని వాట్సప్ లో అప్లోడ్ చేశాడు. ఈ తంతంగం అంతా ముగిసిన తర్వాత పూర్ణిమను ఆసుపత్రిలో చేర్పించాడు.
అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో అభిషేక్ పారిపోయాడు. చికిత్స పొందుతూ పూర్ణిమ శనివారం మృతిచెందారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన లక్ష్మీపురం పోలీసులు శనివారం సాయంత్రం అభిషేక్ ను అదుపులోకి తీసుకున్నారు.