WhatsApp governance In AP | పౌరసేవలు అందించేందుకు దేశంలో తొలిసారిగా ఏపీ ప్రభుత్వం వాట్సప్ గవర్నెన్స్ ( WhatsApp governance ) కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి నారా లోకేశ్ ( Nara Lokesh ) ప్రారంభించారు.
దీని కోసం అధికారిక వాట్సప్ నంబర్ 9552300009 ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ వాట్సప్ అకౌంట్ కు వెరిఫైడ్ ట్యాగ్ కూడా ఉంది. వాట్సప్ గవర్నెన్స్ ద్వారా తొలి దశలో 161 పౌర సేవలను ప్రభుత్వం అందించనుంది.
‘పరిపాలన సంస్కరణల్లో ఇది ఒక చారిత్రాత్మక రోజు. “మన మిత్ర” పేరుతో దేశంలోనే మొదటి సారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు ప్రారంభిస్తున్నాం.’ అంటూ మంత్రి లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ వాట్సప్ అకౌంట్ ద్వార అవసరమైన సమయాల్లో ప్రభుత్వం సందేశాలు కూడా పంపే సదుపాయం ఉంది. ప్రజలు వినతులు, ఫిర్యాదులు కూడా ఈ ఖాతా ద్వారా చేయవచ్చు. ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఇన్ కమ్, నో ఎర్నింగ్ వంటి ఈ సర్టిఫికెట్లు కూడా పొందవచ్చు.