CM Mamata Banerjee Rally | కోల్‌కత్తాలో (Kolkata Trainee Doctor) ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై నిరసన వ్యక్తం చేస్తూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళా ఎంపీలు, యువతులతో కలిసి నడుస్తూ బాధితురాలికి న్యాయం జరగాల్సిందేనని నినదించారు.
ఈ అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఆర్జీ కర్ హాస్పిటల్‌పై దాడి జరిగిన ఘటనలో హైకోర్టు ప్రభుత్వాన్ని మందలించిన కాసేపటికే మమతా ర్యాలీ చేశారు. హత్యాచారం జరిగిన ఆర్‌జీ కార్ హాస్పిటల్ వద్దే ఈ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కొందరు నిజం బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని మండి పడ్డారు. హాస్పిటల్‌పై దాడి చేసింది బీజేపీ, వామపక్షాలేనని ఆరోపించారు.
మహిళా ఎంపీలు, యువతులతో కలిసి “ఉరిశిక్ష వేయాల్సిందే” అంటూ పెద్ద ఎత్తున నినదించారు. సీబీఐకి అల్టిమేటం జారీ చేశారు. తక్షణమే విచారణ జరిపించి నిందితుడికి ఉరిశిక్ష విధించేలా చొరవ చూపించాలని డిమాండ్ చేశారు.