Wayanad Parliament By-Elections News | కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రభంజనం సృస్టిస్తున్నారు.
కేరళ వయనాడ్ ( Wayanad )పార్లమెంటు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రియాంక గాంధీ తిరుగులేని విజయం దిశగా దూసుకెళ్తున్నారు. 4 లక్షల ఓట్ల మెజారిటీ దిశగా ఆమె దూసుకెళ్తున్నారు.
గత ఎన్నికల్లో వయనాడ్ నుండి పోటీచేసిన రాహుల్ గాంధీ 3.64 లక్షల మెజారిటీని దక్కించుకున్నారు. అయితే ప్రియాంక గాంధీ మాత్రం రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) మెజారిటీని సైతం దాటేశారు.
ఓ వైపు మహారాష్ట్ర ( Maharastra ) ఎన్నికల ఫలితాలతో డీలా పడిన కాంగ్రెస్ శ్రేణులు, ప్రియాంక ఘన విజయం సాధించే దిశగా వెళ్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.కాగా గత దశాబ్ద కాలం నుండి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న ప్రియాంక గాంధీ, తొలిసారి వయనాడ్ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు.









