Virat Kohli Clarifies About ‘Like’ On Avneet Kaur’s Bold Photos | ఒక నటి ఫోటోకు లైక్ కొట్టడంతో టీం ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వార్తల్లో నిలిచారు. నటి ఫొటోకు విరాట్ లైక్ చేయడాన్ని గమనించిన నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు.
ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టులకు విరాట్ సతీమణి అనుష్క శర్మను కూడా ట్యాగ్ చేశారు. ఈ సంఘటన గురువారం జరిగింది. యువ నటి అవ్‌నీత్ కౌర్ కు సంబంధించిన ఫోటో ఆమె ఫ్యాన్ పేజీలో అప్లోడ్ అయ్యింది. దీనికి విరాట్ కోహ్లీ లైక్ చేసినట్లు నెటిజన్లు గమనించారు.
దింతో నెటిజన్లు మరియు అభిమానుల నుంచి వివిధ రకాల కామెంట్లు, ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో కోహ్లీ వెంటనే స్పష్టతనిచ్చాడు. తాను ఇన్‌స్టాగ్రామ్ ఫీడ్ క్లియర్ చేస్తున్న సమయంలో, అల్గారిథం పొరపాటు వల్ల లైక్ చేయడం జరిగినట్లు పేర్కొన్నాడు.
దీని వెనుక ఎలాంటి ఉద్దేశం లేదని, దయచేసి అనవసర ఊహాగానాలు చేయవద్దని కోరాడు. కేవలం టెక్నికల్ గ్లిచ్ మూలంగానే ఇలా జరిగిందని కోహ్లీ తెలిపాడు. కాగా అవనీత్ కౌర్, 23 ఏళ్ల బాలీవుడ్ నటి 2014లో “మర్దానీ” సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చురుకుగా ఉంటూ తన ఫోటోలను, వీడియోలను తరచూ పోస్ట్ చేస్తుంది.









