Viral News | మూడు నెలల వయసులో తప్పిపోయిన కుమారుడి ఆచూకీ పాతికేళ్ల తర్వాత లభించింది. దీంతో తల్లిదండ్రుల ఆనందాలకు అవధులు లేవు.
రూ. కోట్ల విలువ చేసే ఆస్తులు వద్ద తనకు ప్రేమాభిమానాలు కావాలని ఆ కుమారుడు కోరాడు. వివరాల్లోకి వెళ్తే చైనాలోని ఓ మిలియనీర్ దంపతుల కుమారుడు మూడు నెలల వయస్సులో కిడ్నాప్ కు గురయ్యాడు.
దింతో కుమారుడిని వెతికేందుకు తల్లిదండ్రులు కోట్లు ఖర్చు చేశారు. సుమారు 26 ఏళ్లపాటు అనాథగా పెరిగిన కుమారుడి ఆచూకీ ఇటీవలే తల్లిదండ్రులకు లభించింది. దీంతో కుమారుడిని కలిసిన ఆ దంపతుల సంబరాలు చేసుకున్నారు. తమ కోట్ల రూపాయల ఆస్తికి వారసుడు వచ్చాడనుకున్నారు.
బంగ్లాలను రాసి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే 26 ఏళ్ళు తాను అనాథగానే పెరిగానని ఇప్పుడు బంగ్లాలు, కోట్ల ఆస్తులు వద్దు కేవలం తాను, తన భార్య ఉండేందుకు ఓ అపార్ట్మెంట్ ఇవ్వాలని కోరగా తల్లిదండ్రులు షాక్ కు గురయ్యారు.
అనాథగా పెరిగిన నాకు కోట్ల ఆస్తులు వద్దు ప్రేమాభిమానాలు కావాలని ఆయన కోరాడు. దింతో సదరు యువకుడి నిర్ణయాన్ని నెటిజన్లు తెగ అభినందిస్తున్నారు.