VIP treatment in Bengaluru prison | బెంగళూరులోని పరప్పన అగ్రహారా సెంట్రల్ జైలు మరోసారి వివాదంలో చిక్కుకుంది. కరుడుగట్టిన నేరస్థులు, దేశ రక్షణకే ప్రమాదం ఈ అయిన ఉగ్రవాదులు జైలులో టీ తాగుతూ, స్మార్ట్ ఫోన్లు వాడుతూ, టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న వీడియోలు కలకలం సృష్టిస్తున్నాయి. మరికొంత మంది నేరస్థులు అయితే మందు పార్టీ చేస్తూ చిందులేస్తూ జల్సాలు చేస్తున్న వీడియోలు వైరల్ గా మారాయి.
ఈ క్రమంలో జైలులో జరుగుతున్న భద్రతా లోపాలు, అక్రమ కార్యకలాపాలు గురించి తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో స్పందించిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భాద్యులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. జైలు లగ్జరీ లాడ్జ్ గా మారకూడదన్నారు. సీరియాల్ రేపిస్టు ఉమేష్ రెడ్డి జైలులో తన బ్యారక్ లో ఫోన్ వాడుతూ, టీవీ చూస్తున్న వీడియో బయటకు వచ్చింది.
హమీద్ షకీల్ మన్నా అత్యంత ప్రమాదకరమైన ఉగ్ర సంస్థ ఐఎస్ఐఎస్ యొక్క రిక్రూటర్ జైలులో టీ తాగుతూ, ఫోన్ స్క్రోల్ చేస్తూ కనిపించారు. నటి రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టైన తరుణ్ రాజు జైలులో వంట చేస్తూ, మొబైల్ ఫోన్ వాడుతూ బిజీ బిజీ గా ఉన్నాడు. ఇలా కరుడుగట్టిన నేరస్థులు జైలులో జల్సాలు చేస్తున్నారు. దింతో జైలు అధికారుల తీరు, నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతోంది.









