Vijayashanti Comments | ఇటీవల బీజేపీ (BJP) నుంచి కాంగ్రెస్ (congress)లో చేరిన మాజీ ఎంపీ విజయశాంతి (Vijayashanti) తాజాగా కాషాయ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు.
బీఆరెస్ (BRS Party)తో బీజేపీ అవగాహన కుదుర్చుకుందని, అందుకే కేసీఆర్ కుటుంబం పై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని బీజేపీ ఆరోపించారు.
ఆగస్ట్ 27న బైరాన్ పల్లి, పరకాల మారణకాండ కు గుర్తుగా ‘ రజాకార్ల దుష్కృత్యాల సంస్మరణ దినం’ గా ప్రకటిస్తామని తమ మేనిఫెస్టో లో ప్రకటించింది బీజేపీ.
కాగా ఈ హామీ పై ధ్వజమెత్తారు విజయశాంతి. “దశాబ్దాల నాటి భైరాన్‌పల్లి సంస్మరణదినం, ఆ తర్వాత, ప్రతి మండలం, పల్లెలల్ల స్మారకాలు.. ఈ అంశాలన్నిటి పట్ల ఇప్పటి ప్రజలకు ఏ భావోద్వేగం ఉండాలనే ప్రయత్నం మీది? అమిత్ షా(Amit Shah) గారూ?
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దోపిడీని విడిచిపెట్టి మేనిఫెస్టో లో ఇలాంటి హామీలు ప్రకటించడం ద్వారా తెలంగాణలలో మతవిద్వేషాలు రెచ్చగొడుతూ.. ఆ విద్వేషాల విధానంపైనే నడిచే ఎంఐఎంను, అన్నిచోట్లకు తెచ్చి, ప్రశాంతమైన పల్లెల నెత్తిన కొట్లాటల కుంపటి తెస్తారా అమిత్ షా గారూ…” అంటూ ఘాటుగా ప్రశ్నించారు విజయశాంతి.