Monday 30th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > హోంమంత్రి అనిత కోసం వాహనాలు నిలిపివేత..నెట్టింట విమర్శలు

హోంమంత్రి అనిత కోసం వాహనాలు నిలిపివేత..నెట్టింట విమర్శలు

Vehicles Stopped For Home Minister Anitha | ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత ( Vangalapudi Anitha ) మరియు డీజీపీ ( DGP ) ద్వారకా తిరుమలరావు వస్తున్నారని పోలీసులు వాహనాలు నిలిపివేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఓ వైపు తన కోసం 5 నిమిషాల మించి ట్రాఫిక్ ను అపోద్దని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ( Cm Chandrababu )ప్రకటించారు. మరోవైపు మంత్రుల కోసం, పోలీసు ఉన్నతాధికారుల కోసం వాహనాలు ఆపడం ఏంటని పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు.

మంగళవారం హోంమంత్రి అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు సచివాలయం నుండి తిరిగివెళ్తుండగా కరకట్ట ప్రారంభంలో లాకుల వద్ద పోలీసులు వాహనాలను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చెప్పినా పోలీసులు ఇలా ట్రాఫిక్ ( Traffic ) నిలిపివేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

You may also like
శ్రీవారి ఫోటోలు తీసేసి జీసస్ ఫోటోలు..YSRపై చంద్రబాబు సంచలనం!
ఏపీ బడ్జెట్..పంచాయతీ రాజ్ శాఖకు ఎన్ని రూ.కోట్లంటే!
శభాష్ బండ్ల
‘కేసీఆర్ బీఆరెస్ ను పాతిపెట్టాలి..అదే ఎన్టీఆర్ కు ఘన నివాళి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions