Varanasi Movie Release Date | సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) , దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ (Varanasi Movie). పాన్ వరల్డ్ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
పురాణాలు, కాల ప్రయాణం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా నటిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కొన్ని రోజుల కింద గ్లోబ్ ట్రాటర్ పేరుతో నిర్వహించిన ఈవెంట్ ఈ సినిమా విజువల్స్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు డైరక్టర్ రాజమౌళి. 2027 ఏప్రిల్ 7 ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా లో రిలీజ్ డేట్ తో ఓ పోస్టర్ విడుదల చేశారు.
కాగా, గురువారం వారణాసి పట్టణంలో 2027 ఏప్రిల్ 7 తేదీతో భారీ హోర్డింగ్ లు వెలిశాయి. దాదాపు గా ఈ సినిమా రిలీజ్ డేట్ అయ్యుంటుందని అందరూ అంచనా వేశారు. తాజాగా రాజమౌళీ పోస్ట్ తో క్లారిటీ ఇచ్చేశారు.









