Urvashi Rautela News Latest | బాలీవుడ్ నటి ఊర్వశి రౌతాల మరోసారి సోషల్ మీడియాలో విమర్శల పాలయ్యారు. దీనికి కారణం ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలే. తన పేరు మీద ఆలయం ఉందని, అది కూడా బద్రీనాథ్ ఆలయం పక్కనే ఉన్నట్లు చెప్పారు.
దింతో నెటిజన్లు ఆమెను విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో కూడా ఇలాంటి విచిత్రమైన కామెంట్లు చేసి ఊర్వశి విమర్శల పాలయ్యారు. తాజగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఊర్వశి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తన పేరు మీద ఆలయం ఉన్నట్లు చెప్పారు.
బద్రీనాథ్ ఆలయానికి వెళ్తే పక్కనే ఉన్న తన ఆలయాన్ని కూడా దర్శించాలని తెలిపారు. ఢిల్లీ యూనివర్సిటీలో తన ఫొటోకు దండలు వేసి ‘దండమమాయి’ అని పిలుస్తారని వ్యాఖ్యానించారు. దక్షిణాదిలో తాను చిరంజీవి, బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ లతో కలిసి నటించానని, సౌత్ లో తనకు చాలా మంది అభిమానులు ఉన్నారని ఊర్వశి చెప్పారు.
ఈ క్రమంలో దక్షిణ భారతదేశంలో తన పేరు మీద రెండవ ఆలయాన్ని నిర్మించాలని కోరుకున్నారు. ప్రస్తుతం నటి చేసిన వ్యాఖ్యలపై మీమ్స్, జోకులు పేలుతున్నాయి