Thursday 3rd July 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘అలా పిలిచి రామ్ చరణ్ ను అవమానించారు’

‘అలా పిలిచి రామ్ చరణ్ ను అవమానించారు’

ram charan
  • ఉపాసన మేకప్ ఆర్టిస్ట్ జెబా హస్సన్ ఆరోపణలు
  • షారూఖ్ తీరుపై అసహనం

Ram Charan At Ambani’s Event | మెగాపవర్ స్టార్ రాం చరణ్ (Ram Charan)ను బాలీవుడ్ నటుడు షా రూఖ్ ఖాన్ (Sharukh khan)అవమానించారని విమర్శించారు ఉపాసన కొణిదెల (Upasana) వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ జెబా హస్సన్.

ఇటీవల ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ- రాధిక ల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ గుజరాత్ లోని జాంనగర్ లో మూడు రోజుల పాటు ఘనంగా జరిగింది.

ఈ ఈవెంట్ కు రామ్ చరణ్‌‌-ఉపాసన జంట కూడా హాజరైంది. అయితే ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ సందర్భంగా బాలీవుడ్ ఖాన్ త్రయం షా రూఖ్, సల్మాన్ , అమీర్ ఖాన్ నాటు నాటు పాటకు స్టెప్పులేశారు.

ఆ సమయంలో రామ్ చరణ్ ను కూడ వేదికపైకి పిలిచారు షా రూఖ్. కానీ ఆ సమయంలో ‘ఇడ్లీ వడ.. రాం చరణ్ నువ్వు ఎక్కడ’ అని సంభోదించారు షా రూఖ్. దీంతో ఈ వ్యాఖ్యలు తనను ఎంతగానో బాధించాయని తెలిపారు జెబా హస్సన్.

ఒక తెలుగు నటుడ్ని పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అవమానకరమన్నారు ఆమె. షా రూఖ్ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత తాను ఈవెంట్ నుండి వెళ్లిపోయినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు జెబా హస్సన్.

You may also like
kavitha pressmeet
BJP అధ్యక్షుడి హోదాలో తొలి విజయం సాధించండి: ఎమ్మెల్సీ కవిత!
bombay high court
“ఐ లవ్ యూ చెప్పడం నేరం కాదు..” బాంబే హైకోర్టు!
ENG vs IND రెండో టెస్టు..స్లిప్స్ లో జైస్వాల్ ఉండడు !
‘సంపూర్ణ సహకారం అందిస్తాం..ఈటల కీలక వ్యాఖ్యలు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions