Upasana Konidela On Sanatana Dharma | నటుడు రాం చరణ్ ( Ram Charan ) సతీమణి ఉపాసన కొణిదెల ( Upasana Konidela ) ఆసక్తికరమైన పోస్టును షేర్ చేశారు.
ఆపదలో ఉన్నవారికి గౌరవం, సానుభూతితో వైద్యం అందించడమే నిజమైన సనాతన ధర్మం అని తాతయ్య తమకు నేర్పించారని ఉపాసన పేర్కొన్నారు. ఈ మేరకు అయోధ్య రామాలయం వద్ద దిగిన ఫోటోలను షేర్ చేశారు.
తాతయ్య మాటలతో స్ఫూర్తి పొందిన మేము అయోధ్య రామ మందిరం వద్ద అపోలో ఉచిత ఎమర్జెన్సీ కేర్ సెంటర్ ను ప్రారంభించినట్లు తెలిపారు.
తిరుమల, శ్రీశైలం, కేధర్నాథ్ వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల వద్ద విజయవంతంగా హెల్త్ కేర్ సెంటర్లను నడుపుతున్నట్లు, ఇప్పుడు అయోధ్యలో కూడా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. హెల్త్ సెంటర్ ను ఏర్పాటు చేయడానికి సహకరించిన వారందరికి ఉపాసన కృతజ్ఞతలు చెప్పారు.