Bandi Sanjay On Phone Tapping Issue | తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై (Phone Tapping Issue) కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) కీలక వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు చెప్పింది తానేనన్నారు.
హైదరాబాద్, సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. ప్రభాకర్ రావు చాలా మంది జీవితాలను నాశనం చేశారని మండిపడ్డారు బండి సంజయ్. బీఆరెస్ నాయకులు, వారి భార్యల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. పెద్దాయన చెబితే ఫోన్ ట్యాపింగ్ చేశామని ఇప్పటికే రాధాకిషన్ చెప్పినట్లు వెల్లడించారు.
కేసీఆర్, కేటీఆర్ ఇంకా ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్కు వారే కారణమని ఆరోపించారు. సీఎంవోను అడ్డాగా చేసుకొని ఫోన్ ట్యాపింగ్ చేశారని విమర్శించారు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం మర్యాదలు చేయడం ఆపాలని సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభాకర్ రావు అండ్ కోను కాపాడే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ప్రభాకర్రావు ఇండియాకు వచ్చేముందు కేటీఆర్ అమెరికా ఎందుకు వెళ్లారనీ, అక్కడ వాళ్ల ఏం మాట్లాడుకున్నారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐ కి అప్పగించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు.