Sunday 8th September 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ఆ వీడియోలు షేర్ చేస్తే కఠిన చర్యలు.. కేంద్ర హోంశాఖ హెచ్చరిక!

ఆ వీడియోలు షేర్ చేస్తే కఠిన చర్యలు.. కేంద్ర హోంశాఖ హెచ్చరిక!

No Social Media

Manipur Violence | దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న మణిపూర్ మహిళ నగ్న ఊరేగింపు ఘటనను కేంద్రం సీరియస్ గా తీసుకుంది.

ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఘటనపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు ఎవరైన వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు.  

ఇద్దరు మణిపూర్ మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన వైరల్ వీడియోను వెంటనే తొలగించాలని ట్విట్టర్‌తో సహా సోషల్ మీడియాప్లాట్‌ఫారమ్‌లను కేంద్రం ఆదేశించింది.

భారతీయ చట్టాలకు కట్టుబడి ఉండటం తప్పనిసరి అని ప్రభుత్వం సూచించింది.

అదేవిధంగా మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నం ఊరేగించటం.. పొలాల్లోకి లాక్కెళ్లుతున్న ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎలాంటి సోషల్ ఫ్లాట్ ఫామ్స్ లో వినియోగించొద్దని కేంద్రం హెచ్చరించింది.

సోషల్ మీడియాలో, వాట్సా ప్ గ్రూప్స్ లో షేర్ చేయొద్దని కేంద్ర హోం శాఖ ఆదేశించింది. ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది కేంద్ర హోం శాఖ.

మరోవైపు మణిపూర్ ఘటనపై రాష్ట్ర పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. మహిళల కిడ్నాప్, సామూహిక అత్యాచారం, హత్య కేసును నమోదు చేశామని తౌబాల్ ఎస్పీ మేఘచంద్ర సింగ్ తెలిపారు.

ఈ దారుణానికి పాల్ప డిన నిం దితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టామన్నా రు.   

You may also like
మణిపూర్ ఘటన: అత్యాచార నిందితుడి ఇంటికి నిప్పు..!
సీఎం రాజీనామా.. మణిపూర్ లో నాటకీయ పరిణామాలు!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions