Metro Stations Closed | తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోది (Narendra Modi) సోమవారం హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు.
నగరంలోని బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు రోడ్ షోలో పాల్గొంటారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ (RTC X Roads) నుంచి కాచిగూడ (Kache Guda) వరకు ఈ రోడ్ షో సాగుతుంది. మోదీ రోడ్ షో (Modi Road Show) నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో కూడా కీలక ప్రకటన చేసింది.
ప్రధాని రోడ్ షో సందర్భంగా భద్రతా కారణాల దృష్ట్యా నగరంలో రెండు మెట్రో స్టేషన్లను రెండు గంటల పాటు మూసివేయనున్నట్లు మెట్రో ఒక ప్రకటన విడుదల చేసింది.
మోదీ రోడ్ షో ఉన్న ప్రాంతంలోని చిక్కడపల్లి (Chikkadpally), నారాయణ గూడ (Narayana Guda) మెట్రో స్టేషన్లను రెండు గంటల పాటు మూసివేస్తునట్లు పేర్కొంది.
ప్రధాని రోడ్ షో కంటే ముందు 4:30 నుంచి తర్వాత 06:30 నిమిషాల వరకు ఈ రెండు మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు మెట్రో తన ప్రకటనలో తెలిపింది.
ప్రయాణికులు తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.