Tula Uma Resigns BJP | ఎన్నికల వేళ బీజేపీ(BJP)కి మరో బిగ్ షాక్ తగిలింది. కరీంనగర్జి ల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ (Tula Uma)ఆ పార్టీకి రాజీనామా చేశారు.
ఈ మేరకు తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి (Kishan Reddy) పంపించారు. తొలుత వేములవాడ (Tula Uma) నియోజకవర్గం నుండి తుల ఉమ ను అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ.
కానీ ఆఖరి నిమిషంలో చెన్నమనేని వికాస్ రావు (Vikas Rao)కు బి ఫార్మ్ ఇవ్వడం తో కన్నీటి పర్యంతం అయ్యారు ఉమ. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా బీఫార్మ్ వేరే వ్యక్తి కి ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు.
ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ కి రాజీనామా చేశారు తుల ఉమ. ఇది కేవలం తనకు జరిగిన అవమానం మాత్రమే కాదని తెలంగాణ లోని గొల్ల కురుమలకు జాతికి జరిగిన అవమానం అంటూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
అస్సలు బి ఫార్మ్ లే ఇవ్వలేని మీరు బిసి నినాదం తో ముందుకు ఎలా పోతారని బీజేపీ ని నిలదీశారు. మహిళా సాధికారత అని చెప్పే బీజేపీ ఒక బీసీ మహిళను అవమానించడం బాధించిందని రాజీనామా లేఖలో పేర్కొన్నారు తుల ఉమ.
ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సమక్షంలో బీఆరెస్ లో తుల ఉమ చేరనున్నట్లు ప్రచారం జరుగుతుంది.