High Court On Kids Missing | తెలంగాణ రాష్ట్రంలో చిన్నారుల మిస్సింగ్ పై ఆవేదన వ్యక్తం చేసింది రాష్ట్ర హై కోర్ట్. ఈ మేరకు చిన్నారులు తప్పిపోయిన కేసుల పై పత్రికల్లో వచ్చిన వార్తలను సుమోటోగా స్వీకరించింది కోర్ట్.
ఈ నేపథ్యంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాథే మరియు జస్టిస్ అనిల్ కుమార్ లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. రాష్ట్రంలో చిన్నారుల మిస్సింగ్ (Missing Kids)అనేది తీవ్రమైన అంశంగా పరిగణించాలని తెలిపింది ధర్మాసనం.
రోజుకు 10 మంది చిన్నారుల మిస్సింగ్ అవ్వడం పై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా కేసుల్లో తెలంగాణ జాతీయ స్థాయిలో 8వ స్థానంలో ఉందని పేర్కొంది. అలాగే ఇంకా 4వేల మంది చిన్నారుల ఆచూకీ లభించకపోవడం పై ప్రభుత్వాన్ని వివరణ కోరింది.
అనంతరం కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మహిళా శిశు సంక్షేమ, హోంశాఖల ముఖ్య కార్యదర్శులకు, డీజీపీకి నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణ ను నాలుగు వారాలకు వాయిదా వేసింది.