Tuesday 17th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > శ్రీవారి లడ్డూలో గుట్కా పొట్లం..స్పందించిన టీటీడీ

శ్రీవారి లడ్డూలో గుట్కా పొట్లం..స్పందించిన టీటీడీ

Tobacco Packet In Tirumala Laddu | తిరుమల ( Tirumala ) శ్రీవారి లడ్డూలో పొగాకు పొట్లం ఉందని ఓ వార్త ఇటీవల వైరల్ గా మారింది.

ఖమ్మం రూరల్ ( Khammam Rural ) మండలం గొల్లగూడెం కు చెందిన మహిళా కు తిరుమల లడ్డూలో పొగాకు పొట్లం వచ్చినట్లు కథనాలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD ) ఈ ఘటనపై స్పందించింది. పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు, కొంతమంది భక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేయడం భావ్యం కాదని టీటీడీ పేర్కొంది.

తిరుమలలోని లడ్డు పోటులో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో, శ్రీవారి లడ్డూలను ప్రతిరోజు లక్షలాదిగా తయారు చేస్తారని స్పష్టం చేసింది.

ఈ లడ్డూల తయారీ కూడా సీసీటీవీల పర్యవేక్షణలో ఉంటుంది, ఇంతటి పకడ్బందీగా లడ్డులు తయారు చేసే వ్యవస్థలో ఈ విధంగా పొగాకు ఉన్నట్లు ప్రచారం చేయడం శోచనీయం అని వస్తున్న వార్తలను టీటీడీ కొట్టివేసింది.

You may also like
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం
‘బీఆర్ నాయుడు కాదు..బీఆర్ కామ నాయుడు’
టీటీడీ ఛైర్మన్ వైరల్ వీడియోలు..స్పందించిన బీఆర్ నాయుడు
ఇరాన్ దాడులు..చిక్కుకున్న పీవీ సింధు, మంచు విష్ణు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions