Monday 12th January 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > తిరుమలలో దువ్వాడతో కలిసి రీల్స్..మాధురి పై పోలీస్ కేసు

తిరుమలలో దువ్వాడతో కలిసి రీల్స్..మాధురి పై పోలీస్ కేసు

Police Case File On Divvala Madhuri | తిరుమల ( Tirumala ) కొండపై అక్టోబర్ 7న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ( Duvvada Srinivas ) తో కలిసి దివ్వల మాధురి రీల్స్ తీశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశేలా ప్రవర్తించారంటూ దివ్వల మాధురి ( Divvala Madhuri )పై తిరుమల వన్ టౌన్ పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. కాగా దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి మాధురి శ్రీవారిని దర్శించుకున్నారు.

అనంతరం ఆలయం ఎదుట రీల్స్ చేయడం పట్ల పలువురు మండిపడ్డారు. ఇలా చేయడం టీటీడీ నిబంధనలు, ఆలయ సంస్కృతిని ఉల్లంఘించడమే అంటూ మరియు మీడియా ముఖంగా సహజీవనం చేస్తున్నామని మాధురి చెప్పడం ద్వారా హిందువుల మనోభావాలను దెబ్బతీశారని టీటీడీ ఏవీఎస్ఓ మనోహర్ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మాధురిపై పోలీసులు కేసును నమోదు చేశారు.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions