Friday 4th April 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > బెదిరించేందుకు ఫ్లేర్ గన్ తో కాల్పులు జరిపిన అనుమానితుడు

బెదిరించేందుకు ఫ్లేర్ గన్ తో కాల్పులు జరిపిన అనుమానితుడు

The suspect fired a flare gun to threaten

-సెర్చ్ వారెంట్ తో తనిఖీ కోసం వచ్చిన పోలీసులు
-అమెరికాలో ఘటన పోలీసులపై కాల్పులు జరిపితే ఇల్లు ధ్వంసం.
.
సెర్చ్ వారెంట్ తో తనిఖీకి వెళ్లిన పోలీసులపైకి ఓ అనుమానితుడు ఫ్లేర్ గన్ తో కాల్పులు జరిపాడు. అదికాస్తా బూమ్ రాంగ్ గా మారి పేలుడు సంభవించి తన ఇల్లే ధ్వంసమైంది. ఇంట్లో పేలుడు పదార్థాలు ఉన్నాయో లేక మరేంటో గానీ ఫ్లేర్ గన్ మంటలకు ఒక్కసారిగా పేలుడు సంభవించింది. సినిమా సన్నివేశం తరహాలో ఒకే ఒక్క క్షణంలో ఇల్లు కుప్పకూలింది. భారీగా మంటలు ఎగసిపడడంతో కాలిబూడిదయింది. అమెరికాలోని వర్జినీయా రాష్ట్రం అర్లింగ్టన్ లో చోటుచేసుకుందీ ఘటన.

అర్లింగ్టన్ పోలీసుల కథనం ప్రకారం బ్లూమాంట్ ఏరియాలోని ఓ ఇంటిని తనిఖీ చేసేందుకు సెర్చ్ వారెంట్ తో అధికారులు వెళ్లారు. పోలీసులను చూసి అనుమానితుడు ఫ్లేర్ గన్ తో కాల్పులు జరిపాడు. ఇంట్లో పలు రౌండ్లు కాల్పులు జరపడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. పేలుడు ఘటన నేపథ్యంలో చుట్టుపక్కల ఇళ్లల్లోని ప్రజలను అక్కడి నుంచి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అనుమానితుడి పరిస్థితి ఏంటనే విషయంపై స్పష్టత లేదని, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని వివరించారు.

You may also like
dr kavvampally satyanarayana
ఎమ్మెల్యే ఆన్ వీల్స్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వినూత్న కార్యక్రమం!
‘హైదరాబాద్ లో వర్షం..పవర్ కట్స్ లేకుండా చూడండి’
శుభ్‌మ‌న్ గిల్ పోస్ట్..విరాట్ కోహ్లీకి కౌంటర్?
‘ఉక్కపోత నుండి ఉపశమనం..నగరంలో వర్షం’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions