Rajeev Yuva Vikasam Last Date | తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) రాష్ట్రంలోని నిరుద్యోగులకు స్వయం ఉపాధి చేకూర్చే నిమిత్తం రాజీవ్ యువ వికాసం (Rajeev Yuva Vikasam) పేరుతో ఓ పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో ఆర్థికంగా వెనుకబడిన యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఈ పథకాన్ని రూపొందించింది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతీ నిరుద్యోగికి రుణాలు అందించనుంది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,42,438 మంది లబ్ధిదారులకు రూ.8,083.23 కోట్లు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిచింది. పథకం ద్వారా అర్హులైన నిరుద్యోగులు రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఆర్థిక సాయం పొందవచ్చు.
ఇందులో 60% నుంచి 80% వరకు సబ్సిడీ ఉండనుంది. మార్చి 17 నుంచి ఈ పథకం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించి, ఏప్రిల్ 14 చివరి తేదిగా ప్రకటించింది. అయితే తాజాగా ఈ స్కీం దరఖాస్తు తేదీని ప్రభుత్వం పొడిగించింది. సాంకేతిక సమస్యల వల్ల అనేకమంది పథకానికి దరఖాస్తు చేసుకోలేకపోయారని.. గడువు పెంచాలని పెద్ద ఎత్తున డిమాండ్స్ వచ్చాయి. దీంతో గడువు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.