Temporary Relief For KTR In Formula E Race Case | బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) కు రాష్ట్ర హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది.
తనపై ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ( FIR ) ను క్వాష్ ( Quash ) చేయాలని కేటీఆర్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం డిసెంబర్ 30 వరకు అరెస్ట్ చేయొద్దని స్పష్టం చేసింది.
అవినీతి నిరోధక చట్టం ( PC Act ) కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని కేటీఆర్ తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరోవైపు ప్రాథమిక దర్యాప్తు పూర్తయిందని మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని ప్రభుత్వ న్యాయవాది కోరారు.
ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం, డిసెంబరు 30వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని తెలిపింది. పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.