Rythu Bharosa Funds | తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్బంగా రైతు భరోసా పథకాన్ని (Rythu Bharosa Scheme) ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంగా కింద రైతులకు ఎకరానికి రూ.12 వేల పెట్టుబడి సాయాన్ని అందించనున్నారు.
అయితే జనవరి 26న కేవలం ఎంపిక చేసిన గ్రామాల్లో మాత్రమే ఈ రైతు భరోసాను అమలు చేశారు. తాజాగా ఈ పథకానికి సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao) ఓ శుభవార్త చెప్పారు. ఫిబ్రవరి 05 నుంచి అన్నదాతల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులను జమ చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు వెల్లడించారు.
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదేశాలతో రైతుల అకౌంట్లలోకి బుధవారం నుంచి రైతుభరోసా డబ్బులు జమ చేస్తున్నట్లుగా తెలిపారు. మొదటి విడతలో ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు రైతు భరోసా నిధులు జమచేస్తామని చెప్పారు.
ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 17.03 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ రైతు భరోసా నిధులు జమవుతాయని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.









