Monday 2nd June 2025
12:07:03 PM
Home > Uncategorized > Hyd నగరవాసులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 రాత్రి ఉచిత ప్రయాణం!

Hyd నగరవాసులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 31 రాత్రి ఉచిత ప్రయాణం!

telangana four wheelers

Free Ride on December 31 | నూతన సంవత్సర వేడుకల వేళ (New Year Celebrations) తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ (Telangana Four Wheelers Association) హైదరాబాద్ నగర వాసులకు ఓ శుభవార్త తెలిపింది.

డిసెంబర్ 31 రాత్రి ఉచిత రవాణా సదుపాయం (Free Journey) కల్పించనున్నట్లు తెలిపింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఉచిత రవాణా సదుపాయం అందిస్తామని వెల్లడించింది.

మద్యం సేవించి వాహనాలు నడిపితే, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఫోర్ వీలర్స్ అసోసియేషన్ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని నగరవాసులకు అసోసియేషన్ కోరింది.

మొత్తం 500 కార్లు, 250 బైక్ టాక్సీలు డ్రైవర్లు అందుబాటులో ఉంటారని, సేఫ్ జర్నీ కోసం ఉచిత రవాణా సదుపాయం అందుబాటులో ఉందన్నారు. అంతేకాకుండా మెట్రో కూడా హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు చెప్పింది.

నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ మెట్రో రైళ్లను డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి వరకు నడపనున్నట్లు మెట్రో ప్రకటించింది. రాత్రి 12.30 గంటల వరకు చివరి రైలు నడపబడుతుందని, ఈ విషయాన్ని నగరవాసులు గుర్తించాలని మెట్రో కోరింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions