Friday 18th October 2024
12:07:03 PM
Home > తాజా > రీపోలింగ్ అభ్యర్థనపై సీఈవో వికాస్ రాజ్ కీలక వ్యాఖ్యలు |

రీపోలింగ్ అభ్యర్థనపై సీఈవో వికాస్ రాజ్ కీలక వ్యాఖ్యలు |

Telangana Election Polling Percentage|

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గురువారం పోలింగ్ ( Polling ) ముగియడంతో శుక్రవారం నాడు మీడియా ( Media )సమావేశం నిర్వహించారు సీఈఓ వికాస్ రాజ్ ( CEO Vikas Raj ).

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో సగటున తెలంగాణ ( Telangana ) లో 70.74 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. 2018 ఎన్నికల్లో 73.37 శాతం పోలింగ్ జరగగా ఈ సారి మూడు శాతం పోలింగ్ తగ్గిందని పేర్కొన్నారు.

అలాగే కొన్ని చోట్ల రిగ్గింగ్ ( Rigging ) జరిగిందని పార్టీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయగా, ఎక్కడ రీ పోలింగ్ కు అవకాశం లేదని స్పష్టం చేశారు వికాస్ రాజ్. కొన్ని ప్రదేశాల్లో రాత్రి 10 గంటల వరకు పోలింగ్ జరిగినట్లుగా చెప్పారు.

హైదరాబాద్ ( Hyderabad ) జిల్లాలో అత్యల్పంగా 46.68 శాతం, భువనగిరి ( Bhuvanagiri ) జిల్లాలో అత్యధికంగా 90.03 శాతం పోలింగ్ నమోదయిందన్నారు. లక్ష 80 వేల మంది పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకున్నట్లు వెల్లడించారు.

డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు కోసం ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నట్లు, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు తెలిపారు వికాస్ రాజ్.

You may also like
తెలంగాణ ఊర్లల్ల అసలైన దసరా సంబురం ఇదే.. ఓ ఎన్నారై యాది!
harish rao
హస్తం తీసేసి ఆ గుర్తు పెట్టుకోండి.. కాంగ్రెస్ పై హరీశ్ రావు హాట్ కామెంట్స్!
Amrapali reddy kata
నగరంలో వాటిపై నిషేధం.. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సంచలన ఆదేశాలు!
cm revanth reddy
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions