CS Shanti Kumari | తెలంగాణలో కొత్త ప్రభుత్వ కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డితోపాటు, పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు చేపట్టారు. గురువారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ మీటింగ్ కూడా జరిగింది.
మరోవైపు తాజా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు తమ అధికారిక భవనాలు ఖాళీ చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు విలువైన ప్రభుత్వ సామగ్రిని తమ వెంట తీసుకెళుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎస్ శాంతి కుమారి కీలక ఆదేశాలు చేశారు.
అనుమతి లేకుండా అధికారిక భవనాల నుంచి వస్తువులను తీసుకెళ్లొద్దని సూచించారు. ఎవరైనా ప్రభుత్వ వస్తువులను తీసుకెళితే వాటిని మళ్లీ రికవరీ చేస్తామని హెచ్చరించారు.