Telangana Congress CLP Meet| తెలంగాణ ( Telangana ) అసెంబ్లీ ( Assembly ) ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ( Congress Party ), సోమవారం ఉదయం హైదరాబాద్ ( Hyderabad ) లోని హోటల్ ఎల్లాలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎల్పీ ( CLP ) సమావేశం జరిగింది.
సుమారు గంట పాటు సీఎల్పీ సమావేశం జరిగింది, అనంతరం మీడియా ( Media ) తో మాట్లాడిన కర్ణాటక ( Karnataka ) డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ( DK Shivakumar ) భేటీలో తీసుకున్న నిర్ణయాలను తెలిపారు.
మొదట కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ తీర్మానం చేసినట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ల అభిప్రాయం తీసుకొని, సీఎల్పీ నేత ఎంపిక బాధ్యతను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే ( Mallikharjun Kharge ) కు అప్పగించినట్లు చెప్పారు.
సీఎం ఎంపిక బాధ్యతను అధిష్టానానికి అప్పగిస్తూ ఎమ్మెల్యేలు ఏకవాక్య తీర్మానం చేశారు.
అలాగే ఖర్గే నిర్ణయాన్ని శిరసావహించాలని తీర్మానించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ( Revanth Reddy ). ఈ తీర్మానాలను ప్రతిపాదించగా భట్టి, దామోదర, పొన్నం, కొండ సురేఖ, తుమ్మల, సీతక్క తదితరులు ఏకవాక్య తీర్మానాన్ని ఆమోదించారు.
కాగా సోమవారం సాయంత్రమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.