CM Revanth Reddy | తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పొల్గొన్న ఉద్యమకారులపై నమోదైన కేసులన్నీ ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు 2009 నుండి ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన 2014 జూన్ 2 వరకు ఉద్యమకారులపై నమోదైన కేసుల వివరాలను ఇవ్వాలని అన్ని జిల్లాల ఎస్పీలకు తెలంగాణ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు.
త్వరలోనే ఉద్యమకారులపై కేసులను ఎత్తివేయనున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.