Tuesday 17th March 2026
12:07:03 PM
Home > క్రీడలు > దుబాయ్ లో టీం ఇండియా..అందరి చూపు ఆ మ్యాచ్ వైపే

దుబాయ్ లో టీం ఇండియా..అందరి చూపు ఆ మ్యాచ్ వైపే

Team India In Dubai | ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ( ICC Champions Trophy )కి సర్వం సిద్ధమైంది. సుమారు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా జరగనుంది. 2017లో పాకిస్తాన్ విజేతగా నిలిచిన విషయం తెల్సిందే.

అయితే పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న ట్రోఫీలో టీం ఇండియా తన మ్యాచులను దుబాయ్ వేదికగా ఆడనుంది. ఈ క్రమంలో శనివారం టీం ఇండియా దుబాయ్ బయలుదేరింది.

కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కోచ్ గంభీర్ మరియు ఇతర ఆటగాళ్లు టీం బస్సులో ముంబయి లోని ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు భారీగా అక్కడికి చేరుకుని టీంఇండియాకు మద్దతుగా నినాదాలు చేశారు.

శనివారం మధ్యాహ్నం విమానం దుబాయ్ కి బయలుదేరింది. గురువారం బంగ్లాదేశ్ తో మ్యాచ్ జరగనుంది. అయితే ఫిబ్రవరి 23న చిరకాల ప్రత్యర్థి పాక్ తో టీం ఇండియా మ్యాచ్ ను ఆడనుంది. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ టీం దుబాయ్ వెళ్లనుంది.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions