TDP Leaders With Jogi Ramesh | మాజీ మంత్రి, వైసీపీ నాయకులు జోగి రమేష్ తో కలిసి వేదిక పంచుకున్నారు మంత్రి పార్థసారథి ( Kolusu Parthasarathy ) మరియు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ( Gouthu Sireesha ).
దింతో వైసీపీ నాయకుడితో సన్నిహితంగా మెలగడం, ఒకే వాహనంపై పై ర్యాలీలో పాల్గొనడం పట్ల టీడీపీ ( TDP ) శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఏలూరు జిల్లా నూజివీడులో జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో జోగి రమేష్ తో టీడీపీ నేతలు వేదిక పంచుకోవడం తీవ్ర వివాదానికి దారి తీసింది. వైసీపీ హయాంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన వ్యక్తి, చంద్రబాబు లోకేష్ లపై ఇష్టమొచ్చినట్లు దుర్భాశలాడిన వ్యక్తితో వేదిక ఎలా పంచుకుంటారని కొందరు కామెంట్లు చేశారు.
ఇదే సమయంలో జోగి రమేష్ తో వేదిక పంచుకోవడం పట్ల మంత్రి నారా లోకేష్ ( Nara Lokesh ) కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అలాగే వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్థసారథి, గౌతు శిరీష స్పందించారు. తమకు ముందుగా జోగి రమేష్ వస్తున్నట్లు సమాచారం లేదని, అది అనుకోకుండా జరిగిన ఘటన అని వివరణ ఇచ్చారు.