Sunday 29th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > ‘అంబటి ఆంబోతు..జగన్ పనికిమాలిన అధ్యక్షుడు’

‘అంబటి ఆంబోతు..జగన్ పనికిమాలిన అధ్యక్షుడు’

TDP Leaders Fires On Ambati Rambabu Comments | మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సీనియర్ నాయకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. ఆంబోతు మాదిరిగా రంకెలేయడం అంబటి రాంబాబుకి అలవాటుగా మారిందని ఆయన ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తా లేక వీధి రౌడీనా అని నిలదీశారు. వైకాపా బూతుల పార్టీ అని మరోసారి నిరూపితం అయిందన్నారు. దిక్కుమాలిన చర్యలతో పనికిమాలిన చేష్టలతో రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని వైకాపా ప్రయత్నం చేస్తుందని, పనికిమాలిన అధ్యక్షుడుగా జగన్ దీనిని ముందుండి నడిపిస్తున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంబటి రాంబాబు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇకపోతే శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు స్పందిస్తూ..ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి వైసీపీ నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం తలదించుకునే విధంగా ఉన్నాయని తెలిపారు. అసభ్య పదజాలంతో దూషణలకు దిగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత స్వేచ్ఛ, అభిప్రాయాలను వెల్లడించే మాటలన్నీ రాజ్యాంగ పరిధిలోనే ఉండాలని చెప్పారు. హద్దులు మీరి పరుష పదజాలం వాడటం సరికాదని హితవుపలికారు.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions