Sydney Sweeney Offered Rs 530 Crore For Bollywood Debut? | హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సినీ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. ఓ బాలీవుడ్ సినిమాలో నటించేందుకు ఈ హాలీవుడ్ నటికి రూ.530 కోట్ల భారీ పారితోషకం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఓ ప్రముఖ వార్తా సంస్థ ప్రచురించింది. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇంతటి రెమ్యునరేషన్ ను ఆఫర్ చేయడం ఇదే తొలిసారి. ఈ మేరకు సిడ్నీ స్వీనీతో బాలీవుడ్ కు చెందిన ఓ పెద్ద నిర్మాణ సంస్థ చర్చలు జరుపుతున్నట్లు కథనాల సారాంశం.
ఈ బాలీవుడ్ మూవీలో సిడ్నీ యంగ్ అమెరికన్ స్టార్ గా నటిస్తారని, ఆమె ఓ భారతీయ సెలబ్రెటీతో ప్రేమలో పడుతుందని, ఈ సినిమా ఇండియన్-అమెరికన్ లవ్ స్టోరీగా రూపొందే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అలాగే సిడ్నీ బాలీవుడ్ మూవీలో నటించేందుకు అంగీకరిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సివుంది.









