–భవిష్యత్తులో టీమిండియా కెప్టెన్ అతడనేట.. ఆకాశ్ చోప్రా చెప్పేశాడు
-ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో భారత్‌ను నడిపించిన సూర్య
-సౌతాఫ్రికా టూర్‌కీ అతడి సారథ్యంలోనే జట్టు
రోహిత్ తర్వాత ముంబై ఇండియన్స్ జట్టు పగ్గాలు అందుకనే చాన్స్ కూడా అతడికే ఉందన్న చోప్రా
టీమిండియాకు ప్రస్తుతం రోహిత్‌శర్మ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. టీ20లకు అతడి గైర్హాజరీలో హార్దిక్ పాండ్యా స్కిప్పర్‌గా జట్టును నడిపిస్తున్నాడు. పాండ్యా కూడా అందుబాటులో లేని సమయంలో సూర్యకుమార్ యాదవ్‌కు మేనేజ్‌మెంట్ పగ్గాలు అప్పగించింది. ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌లో జట్టుకు సారథ్యం వహించిన సూర్య.. 4-1 తేడాతో సిరీస్‌ను అందించిపెట్టాడు.
ఈ నేపథ్యంటో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో భారత జట్టుకు పగ్గాలు చేపట్టే జాబితాలో సూర్యకుమార్ ఉన్నాడనే తాను చెబుతానని పేర్కొన్నాడు. టీమిండియాకు మూడో ఆప్షన్ అతడే అవుతాడని స్పష్టం చేశాడు. భారత జట్టుకే కాదని, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు కూడా ఇదే వర్తిస్తుందని చెప్పాడు. రోహిత్‌శర్మ తర్వాత పగ్గాలు స్వీకరించే అవకాశం అతడికే ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డాడు.
గత సీజన్‌లో జట్టులో రెండో స్థానంలో ఉన్న సూర్య.. ఇప్పుడు పాండ్యా తిరిగి ముంబైకి రావడంతో మూడో స్థానంలోకి వెళ్లిపోయాడని పేర్కొన్నాడు. అయితే, క్రికెట్‌లో ఎప్పుడేం జరుగుతుందో ఊహించడం కష్టమని పేర్కొన్నాడు. సౌతాఫ్రికా పర్యటనలోనూ జట్టును సూర్యే నడిపిస్తాడని, అయితే, టీ20 ప్రపంచకప్ పరిస్థితి మాత్రం వేరేగా ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో సూర్య తన కెప్టెన్సీతో ఆకట్టుకున్నాడని ప్రశంసించాడు. ఉన్న వనరులనే సద్వినియోగం చేసుకున్నాడని కొనియాడాడు.