Thursday 5th March 2026
12:07:03 PM
Home > తాజా > గ్రూప్ 1 పరీక్షపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు

గ్రూప్ 1 పరీక్షపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు

Supreme Court On Group 1 Exam | సర్వోన్నత న్యాయస్థానంలో తెలంగాణ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది.

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 29 ( G.o. no. 29 )ని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్ 1 అభ్యర్థులు ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ ( Petition ) దాఖలు చేశారు. అంతేకాకుండా తీర్పు వచ్చేవరకు పరీక్ష వాయిదా వేయాలని కోరారు.

కాగా సోమవారం ఈ పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది.పిటిషనర్ల తరఫున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ( Kapil Sibal ) వాదనలు వినిపించారు.

అయితే ఇప్పటికే అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లో ఉన్నారని ఇలాంటి సమయంలో గ్రూప్ 1 అభ్యర్థుల పిటిషన్ పై జోక్యం చేసుకునేందుకు సుప్రీం నిరాకరించింది. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు కూడా నిరాకరించింది.

కానీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష ఫలితాలకు ముందే హైకోర్టు ( Telangana High Court )లో గ్రూప్ 1 కేసు విచారణను ముగించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

You may also like
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం
‘బీఆర్ నాయుడు కాదు..బీఆర్ కామ నాయుడు’
టీటీడీ ఛైర్మన్ వైరల్ వీడియోలు..స్పందించిన బీఆర్ నాయుడు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions