SSMB 29 Movie Updates | టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu ), దర్శక ధీరుడు రాజమౌళి ( SS Rajamouli )కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే.
ఎస్ఎస్ఎంబీ29 వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని ఏకంగా పాన్ వరల్డ్ సినిమాగా చిత్రీకరిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ సినిమా షూటింగ్ మొదలైంది. తాజాగా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ గచ్చిబౌలిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమా పట్ల దర్శకుడు రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయం కూడా లీకవ్వకుండా కేర్ తీసుకుంటున్నారట.
అందులో భాగంగానే షూటింగ్ సెట్స్ ( Shooting Sets ) లోకి ఎవరి ఫోన్ కూడా అనుమతించడం లేదని టాక్. చివరికి హీరో మహేష్ బాబు కు కూడా మినహాయింపు ఇవ్వలేదట. ఇటీవల సింహంని జైల్లో బంధించి దాని పాస్‌పోర్టుని తీసుకున్నట్టు ఓ మోషన్ పోస్టర్ ని రాజమౌళి తన ఇన్‌స్టాలో షేర్ చేసిన విషయం తెలిసిందే.
కెఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను ఫారెస్ట్ అడ్వెంచర్ గా రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. ప్రియాంక చోప్రా ( Priyanka Chopra ) కీలక పాత్ర లో నటించనున్న ఎస్ఎస్ఎంబీ29కు ఆస్కార్ విజేత ఎం.ఎం కీరవాణి ( MM Keeravani ) సంగీతం అందిస్తున్నారు.