SS Rajamouli In Conversation With James Cameron | ‘వారణాసి’ షూటింగ్ జరుపుకునే సమయంలో సెట్ కు రావొచ్చా అని దర్శకధీరుడు రాజమౌళిని అడిగారు హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్.
కామెరూన్ దర్శకత్వం వహించిన ‘అవతార్-3 ఫైర్ అండ్ యాష్’ డిసెంబర్ 19న విడుదల కానుంది. ఈ క్రమంలో ఇండియాలో మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ కొనసాగుతున్నాయి. రాజమౌళి సహా కొద్దిమంది సినీ ప్రముఖులకు అవతార్ ను ప్రత్యేకంగా చూపించారు. ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి-కామెరూన్ వీడియో కాల్ లో సంభాషించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను తాజగా విడుదల చేశారు.
వీడియో కాల్ సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ మూవీ గురించి అడిగారు కామెరూన్. షూటింగ్ ఎక్కడి వరకు వచ్చిందని అడిగారు. దీనిపై స్పందించిన రాజమౌళి ఏడాదిగా షూటింగ్ జరుగుతోందని మరో ఏడు, ఎనమిది నెలల్లో షూటింగ్ ముగుస్తుందని చెప్పారు. అనంతరం వారణాసి సెట్ కు వచ్చి షూటింగ్ చూడొచ్చా అని కామెరూన్ రాజమౌళిని కోరారు. దింతో దర్శకధీరుడు సంతోషం వ్యక్తం చేస్తూ.. స్వాగతం పలికారు. ఇండస్ట్రీ మొత్తం ఎంతో థ్రిల్ ఫీల్ అవుతుందన్నారు. ఇకపోతే గతంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను చూసిన కామెరూన్ రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తిన విషయం తెల్సిందే. మరీ ముఖ్యంగా పులులు, ఇతర జంతువులతో ఇంటర్వల్ సీన్ ను కొనియాడారు. అప్పట్లో రాజమౌళి-కామెరూన్ కలిసి ఆర్ఆర్ఆర్ పై చర్చించుకున్న దృశ్యాలు తెగ వైరల్ గా మారాయి.









