Tuesday 17th March 2026
12:07:03 PM
Home > తాజా > ‘హనుమంతుడిపై కోపం వచ్చింది’

‘హనుమంతుడిపై కోపం వచ్చింది’

case filed on rajamouli

SS Rajamouli Comments On Lord Hanuman | హనుమంతుడిపై దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. హనుమంతుడిపై తనకు కోపం వచ్చిందని, ఆయన్ను అమితంగా కొలిచే తన భార్యపై కూడా కోపం వచ్చిందని రాజమౌళి కామెంట్ చేశారు.

శనివారం రామోజీ ఫిల్మ్ సిటీలో గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ సందర్భంగా దేశంలోనే అతి పెద్ద ఎల్ఈడీ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. ఈ స్క్రీన్ పై స్పెషల్ వీడియోను ప్రదర్శిస్తూ మూవీ టైటిల్ ‘వారణాసి’ అని ప్రకటించారు. అలాగే మహేశ్ బాబు లుక్ ను రిలీజ్ చేస్తూ మూవీ గ్లింమ్స్ ను విడుదల చేసిన విషయం తెల్సిందే. అయితే అంతకంటే ముందు ఎల్ఈడీ స్క్రీన్ లో కాస్త సాంకేతిక సమస్య వచ్చింది. ఈ భారీ స్క్రీన్ పని చేయాలంటే సుమారు 45 జెనరేటర్లు ఓని చేయాలి.

ఈ క్రమంలో సమస్య ఏర్పడడంతో గ్లింమ్స్ రిలీజ్ లో కాస్త ఆలస్యం, గందరగోళం ఏర్పడింది. దింతో దర్శకుడు అయోమయానికి గురయ్యారు. ఇదే సమయంలో వేదికపై మాట్లాడిన కథా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ హనుమంతుడు వెనుకుండి నడిపిస్తాడు అని పేర్కొన్నారు. అనంతరం రాజమౌళి మాట్లాడుతూ తన ఆవేదనను పంచుకున్నారు.

‘నాకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేదు. కానీ నాన్నగారు వచ్చి హనుమంతుడు మన వెనుకాల ఉన్నాడు, గుండెతట్టి నడిపిస్తాడు అనగానే నాకు కోపం వచ్చింది. నా భార్యకు హనుమంతుడు అంటే చాలా ఇష్టం. ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడుతుంది. ఆమెపై కూడా నాకు కోపం వచ్చింది. వెనకాల ఉంటే ఇలానేనా నడిపించేది అని’ అంటూ రాజమౌళి చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions