Tuesday 10th February 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > గొప్ప మనసు చాటుకున్న శృతిహాసన్..

గొప్ప మనసు చాటుకున్న శృతిహాసన్..

sruthi hassan


చిన్నారి ప్రాణాలు నిలబెట్టిన నటి!

Sruthi Hassan Help A Girl | ప్రముఖ నటి శ్రుతి హాసన్ (Sruthi Hassan) తన గొప్ప మనసును చాటుకున్నారు. ఓ చిన్నారి ప్రాణాలను నిలబెట్టడానికి అండగా నిలిచారు. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ చిన్నారి వైద్యానికి సహాయం చేశారు.

సకాలంలో ఆమె అందించిన సహాయంతో ఆ చిన్నారి ప్రాణాలు నిలబెట్టారు. వివరాల్లోకి వెళితే, ‘ఆళ్వి’ అనే చిన్నారి మెండెలియన్ ససెప్టబిలిటీ టు మైకోబాక్టీరియల్ డిసీజెస్ అనే అరుదైన జన్యు సంబంధిత వ్యాధితో బాధపడుతోంది.

ఆ చిన్నారికి అత్యవసరంగా బోన్‌మ్యారో ట్రాన్స్‌ ప్లాంట్ చేయాలని వైద్యులు సూచించారు. ఈ విషయం శ్రుతి హాసన్ దృష్టికి రావడంతో వెంటనే స్పందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. చిన్నారి చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం అందించారు.

శ్రుతి చొరవతో ఆ చిన్నారికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయి ప్రస్తుతం కోలుకుంది. ఆళ్వితో శృతిహాసన్ ఆడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శృతిహాసన్ గొప్ప మనసుకు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

You may also like
konda sushmitha book rudra
మంత్రి కుమార్తె రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన చిరంజీవి!
vc sajjanar
మీట్ యువర్ సీపీ.. హైదరాబాద్ కొత్వాల్ సజ్జనర్ సరికొత్త కార్యక్రమం!
Election commission
ఆడపిల్ల పుడితే రూ.10 వేలు.. పెళ్లికి రూ. 25 వేలు!
రాముడి గుడి కడితే మీరు ఒక ట్వీట్ అయినా చేశారా జగన్: నాగబాబు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions