SRH set to trade Mohammed Shami to LSG | ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ నేపథ్యంలో ఫ్రాంచైజీలు రిలీజ్ చేయనున్న ప్లేయర్ల జాబితాను బీసీసీఐకి సమర్పించేందుకు సమయం దగ్గరపడుతోంది. శనివారం మధ్యాహ్నం మూడు గంటల లోపు ఫ్రాంచైజీలు రిలీజ్ చేసిన ప్లేయర్ల జాబితాను సమర్పించాల్సి ఉంది.
ఇదే సమయంలో ఫ్రాంఛైజీల మధ్య ప్లేయర్ల ట్రేడ్ జయుగుతుంది. ఇందులో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బౌలర్ మహమ్మద్ షమీని వదులుకునేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది. రూ.10 కోట్లను హైదరాబాద్ కు చెల్లించి షమీని ట్రేడ్ ద్వారా దక్కించుకునేందుకు లక్నో సూపర్ జయింట్స్ సిద్ధం అయినట్లు కథనాలు వస్తున్నాయి.
యూపీకి చెందిన షమీ తిరిగి సొంత జట్టుకు రావడం ఖాయంగా కనిపిస్తుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఎల్ఎస్జీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. షమీకి లక్నోలోని ఏకానా స్టేడియంతో మంచి అనుబంధం ఉందని ఆ జట్టు తెలిపింది.









