Friday 22nd November 2024
12:07:03 PM
Home > క్రీడలు > రాజీనామా రచ్చ కోహ్లీని తాను తొలిగించలేదన్న సౌరవ్‌ గంగూలీ

రాజీనామా రచ్చ కోహ్లీని తాను తొలిగించలేదన్న సౌరవ్‌ గంగూలీ

Sourav Ganguly said that he did not fire Ratcha Kohli's resignation

న్యూఢిల్లీ : విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై మళ్లీ వివాదం చెలరేగింది. జీ న్యూస్‌ ప్రత్యేక కార్యక్రమం ‘దాదాగిరి అన్‌లిమిటెడ్‌’ పదో సీజన్‌లో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీతో జరిపిన చర్చలో కోహ్లీని తాను కెప్టెన్సీనుంచి తప్పించలేదని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని పలుమార్లు స్పష్టీకరించినట్టు తెలిపాడు. 2021 టీ20 ప్రపంచకప్‌లో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడని చెప్పాడు. వాస్తవానికి తాను టీ20 కెప్టెన్‌గా కొనసాగాలని కోహ్లీని ప్రత్యేకంగా కోరానని, అయినా అందుకు సుముఖత వ్యక్తం చేయలేదన్నాడు. ఒకవేళ నిర్ణయం మార్చుకోకుంటే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ నుంచి కెప్టెన్సీ వదులుకుంటే అపుడు తెల్లబంతి క్రికెట్‌కు ఒకరు, ఎర్రబంతి క్రికెట్‌కు ఒకరు కెప్టెన్‌గా ఉంటారని వివరించానన్నాడు
ఆ సమయంలో మూడు ఫార్మాట్లలో సారథ్యం వహించేందుకు రోహిత్‌శర్మ సిద్ధంగా లేడని దాదా తెలిపాడు. కోహ్లీ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో రోహిత్‌ను తానే ఒప్పించానన్నాడు. మూడు ఫార్మాట్లలో కెప్టెన్సీ వహించడం ఎవరికైనా కష్టమేనని, అది వారి ప్రదర్శనపై ప్రభావం చూపుతుందన్నాడు. నాటి పరిణామాలతో ఎవరిని కెప్టెన్‌గా చేయాలన్న సెలెక్షన్‌ కమిటీ నిర్ణయంలో తాను జోక్యం చేసుకోలేదన్నాడు. బోర్డు అధ్యక్షుడిగా భారత క్రికెట్‌ ఉన్నతికి తనవంతు కృషి చేశానని సౌరవ్‌ అన్నాడు. కోహ్లీ టీ20 కెప్టెన్సీనుంచి తప్పుకోవడంతో తెల్ల బంతి ఫార్మాట్‌కు ఇద్దరు కెప్టెన్లు ఉండడం మంచిది కాదనే భావనతో రోహిత్‌కు పగ్గాలు ఇవ్వడం జరిగిందని సౌరవ్‌ వివరించాడు.

కోహ్లీ మాట మారుస్తున్నాడా..చేతన్‌శర్మ
కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానన్నప్పుడు కొంతకాలం కొనసాగాలని సౌరవ్‌ కోరినట్టు అప్పటి చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ తెలిపాడు. 2021 డిసెంబర్‌లో సౌరవ్‌-కోహ్లీ మధ్య స్పర్ధపై మాట్లాడుతూ గంగూలీ అభ్యర్థనను కాదన్న కోహ్లీ తర్వాత తనను కెప్టెన్‌గా కొనసాగాలని బోర్డు కోరలేదని చెప్పడం తనను ఆశ్చర్యపరిచిందన్నాడు. కోహ్లీ ఎందుకో నిజాన్ని దాస్తున్నాడని, దీనిపై అతడే వివరణ ఇవ్వాలన్నాడు. ఒక ఆటగాడు తన అభిమతానికి ప్రాధాన్యం ఇస్తూ బోర్డు అధ్యక్షుడిని బాధ్యుడిని చేయడం తగదన్నాడు. అది బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య దూరం పెంచుతుందన్నాడు. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్నది పక్కనబెడితే ఇటువంటి విషయాలలో గోప్యత అవసరమన్నాడు. ఎందరో గొప్ప ఆటగాళ్లు వచ్చారు, వెళ్లారని.. క్రికెట్‌ మాత్రం తన ఉనికిని కాపాడుకుంటుందని అన్నాడు. ఎవరైనా ఆటగాడు తాను ఆట కంటే గొప్పవాడని భావిస్తే అది వివాదాలకు దారితీస్తుందన్నాడు.

బోర్డు పట్టించుకోలేదు: కోహ్లీ
తన రాజీనామాపై బోర్డు పట్టించుకోలేదని, తాను టీ20 కెప్టెన్సీని వదులుకుంటానని తెలిపినపుడు కొనసాగాలని ఎవరూ చెప్పలేదని గతంలో కోహ్లీ ఒక సందర్భంగా తెలిపాడు. బోర్డు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను ముందుగా టీ20 కెప్టెన్సీని వదులుకున్నానని, తనపై ఒత్తిడి పెరుగుతుండడంతో క్రమంగా వన్డేలకు, టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నానని తెలిపాడు. సారథిగా ఉన్న సమయంలో కోచ్‌ రవిశాస్త్రి, సహాయ సిబ్బంది, సహచరులు అందించిన సహకారం మరువలేనిదన్నాడు. అంతేగాక తన ఆరాధ్య క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ కొన్ని సందర్భాలలో వారసుడిగా తనను సూచించాడని గుర్తు చేసుకున్నాడు.

You may also like
ఐపీఎల్ ఆక్షన్ లో ఏ ఫ్రాంచైజీకి వెళ్తున్నావ్?.. పెర్త్ టెస్టులో వైరల్ వీడియో
బీరు బిర్యానీ వ్యాఖ్యలు..మరో వివాదంలో కొండా సురేఖ
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై హైకోర్టు సంచలన తీర్పు
కంగారూలనే కంగారు పెట్టించిన బూమ్ బూమ్ బుమ్రా

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions