Wednesday 28th May 2025
12:07:03 PM
Home > క్రీడలు > ఆసీస్ గడ్డపై కోహ్లీకి ఇదే చివరి సిరీస్ : సౌరబ్ గంగూలీ

ఆసీస్ గడ్డపై కోహ్లీకి ఇదే చివరి సిరీస్ : సౌరబ్ గంగూలీ

Sourav Ganguly Backs Virat Kohli | టీం ఇండియా ( Team India ) రన్ మెషీన్ విరాట్ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ.

సొంతగడ్డపై న్యూజీలాండ్ ( New Zealand ) తో జరిగిన టెస్టు సిరీస్ లో విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. అలాగే ఈ ఏడాది ఆడిన 12 టెస్టు ఇన్నింగ్స్ లో కేవలం 250 పరుగులే చేసాడు. దింతో కోహ్లీ ఫార్మ్ ( Form ) పై విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఈ క్రమంలో కోహ్లీకి అండగా గంగూలీ నిలిచాడు. ఆస్ట్రేలియా గడ్డపై జరగబోయే బోర్డర్-గావస్కర్ ( Border-Gavaskar ) ట్రోఫీ కోహ్లీకి మంచి అవకాశమన్నారు. ఆస్ట్రేలియా గడ్డపై 13 టెస్టుల్లో 6 సెంచరీలతో కోహ్లీ 1352 పరుగులు చేశాడు.

ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీకి మంచి రికార్డ్ ( Record ) ఉందని గంగూలీ పేర్కొన్నారు. బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్ లో కోహ్లీ తిరిగి ఫార్మ్ లోకి వస్తాడని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ ఆడబోయే చివరి టెస్టు సిరీస్ ఇదే అయ్యే అవకాశం ఉందని తెలిపారు.

You may also like
అమృత్ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని
క్యాన్సర్ బారిన పడిన వ్యక్తికి అండగా సీఎం
‘జల్సాల కోసం రూ.172 కోట్లతో హెలికాప్టర్’..YCP vs TDP
‘భారీగా పెరిగిన WTC ప్రైజ్ మనీ..ఎన్ని రూ.కోట్లంటే!’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions