Sonu Sood Refused The Post Of A Chief Minister | నటుడు సోనూసూద్ కీలక విషయాలను పంచుకున్నారు. తనకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, రాజ్యసభ సీటు ఇలా తనకు గతంలో ఎన్నో ఆఫర్లు వచ్చినట్లు పేర్కొన్నారు.
కరోనా సమయంలో ఎందరికో సహాయం చేసిన సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తారని కథనాలు వచ్చాయి. కానీ ఆయన మాత్రం పాలిటిక్స్ వైపు ఇప్పటివరకు వెళ్ళలేదు.
అయితే దేశంలో పేరున్న కొందరు నేతలు, పార్టీలు తనకు సీఎం సీటును ఆఫర్ చేశాయని కానీ తాను తిరస్కరించినట్లు చెప్పారు. దింతో డిప్యూటీ సీఎం, లేదంటే రాజ్యసభ సీటు ఇస్తామని వారు చెప్పినట్లు తెలిపారు.
రాజకీయాల్లోకి వస్తే జవాబుదారీతనంతో వ్యవహరించాలని ఇది తనను భయపెడుతుందని సోనూసూద్ చెప్పారు. డబ్బు సంపాదించుకోవడం లేదా పదవుల కోసం చాలా మంది రాజకీయాల్లోకి వస్తారని కానీ వీటి పట్ల ఆసక్తి లేదన్నారు ఈ నటుడు. ప్రజా సేవ చేయడమే రాజకీయం అయితే ఇప్పుడు తాను సొంత డబ్బులతో అదే చేస్తున్నానన్నారు.