Friday 22nd November 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ‘Squid Game’ తన స్టోరీనే అంటూ కోర్టుకెక్కిన బాలీవుడ్ డైరెక్టర్

‘Squid Game’ తన స్టోరీనే అంటూ కోర్టుకెక్కిన బాలీవుడ్ డైరెక్టర్

Soham Sha sued Netflix and the creators of ‘Squid Game’ | ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్ ( OTT Platform ) నెట్ఫ్లిక్స్ ( Netflix ) లో రిలీజైన సౌత్ కొరియన్ థ్రిల్లర్ ‘స్క్విడ్ గేమ్’ ( Squid Game ) ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ పొందింది.

అయితే తాజాగా తన సినిమా కథను కాపీ ( Copy ) కొట్టి స్క్విడ్ గేమ్ తీసారంటూ కోర్టు మెట్లెక్కారు ప్రముఖ బాలీవుడ్ దర్శకులు సోహమ్ షా ( Sohan Shah ).

2009 లో సోహామ్ షా దర్శకత్వం వహించిన మూవీ ‘లక్’ ( Luck ). మిథున్ చక్రవర్తి, సంజయ్ దత్, ఇమ్రాన్ ఖాన్ నటించిన ఈ మూవీ యావరేజ్ గా నిలిచింది. ఇదే మూవీ ద్వారా శ్రుతి హాసన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

అయితే లక్ మూవీ కథను కాపీ కొట్టి స్క్విడ్ గేమ్ ను తీసారంటూ న్యూయార్క్ ఫెడరల్ కోర్టు ( Newyork Federal Court )ను దర్శకుడు ఆశ్రయించారు. ఇది పూర్తిగా కాపీరైట్ కిందకు వస్తుందని, నెట్ఫ్లిక్స్ నుండి స్క్విడ్ గేమ్ ను తొలగించాలని సోహామ్ షా పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా సోహమ్ షా ఆరోపణల పై నెట్ఫ్లిక్స్ స్పందించింది. ఇందులో ఎటువంటి నిజం లేదని, కథను రాసింది, దర్శకత్వం వహించింది డాంగ్ హ్యూక్ అని స్పష్టం చేసింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions